పరకాల మున్సిపాలిటీ నూతన పాలక మండలి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి…
గ్రేటర్ న్యూస్, పరకాల : పరకాల పట్టణ అభివృద్ధి ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా పాలక మండలి పని చేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.శుక్రవారం పరకాల పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో పరకాల మున్సిపాలిటీ నూతన పాలక మండలి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్,పాలక మండలి సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అనంతరం శాలువాతో కౌన్సిలర్లను ఎమ్మెల్యే రేవూరి ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ…పట్టణ అభివృద్ధి ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా పాలక మండలి పని చేయాలన్నారు.పరకాల పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు మున్సిపాలిటీ పాలక మండలి కృషి చేయాలని కోరారు.పరకాల పట్టణ అభివృద్ధికి నూతన కౌన్సిలర్లు,అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




