Breaking
1 Jun 2026, Mon

నాలుగో బెటాలియన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు…

గ్రేటర్ న్యూస్, మామునూరు : నాలుగో బెటాలియన్ ఆవరణలో అంతర్జాతీయ మహిళ దినోత్సవమును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమాండెంట్  బెటాలియన్ లోని మినిస్ట్రీయల్ స్టాఫ్ లోని మహిళలను,బెటాలియన్ లో విధులు నిర్వహించే మహిళలను సన్మానించి వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి కమాండెంట్ మాట్లాడుతూ… నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని అలాగే నేటి సమాజంలో స్త్రీల పాత్ర చాలా కీలకంగా ఉందన్నారు.మహిళల సేవలు వెలకట్టలేనివని తెలియజేశారు.నేటి మహిళలు కుటుంబం యోగక్షేమాలు చూసుకుంటూనే వ్యాపార, రాజకీయ,అంతరిక్ష వ్యవస్థ వరకు ప్రతి రంగంలో తమదైనా ముద్ర వేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ క్రిష్ణ ప్రసాద్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు విజయ్, కార్తీక్,రవి,సర్వర్, వెంకటేశ్వర్లు,రాజ్ కుమార్,కృష్ణ మరియు అధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *