గ్రేటర్ న్యూస్, హనుమకొండ :నగరంలోని నక్కలగుట్ట లో నూతనంగా ఏర్పాటు చేసిన జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం ను గురువారం ప్రముఖ సిని నటి అంతర స్వర్ణాకర్,తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిధిలుగా హాజరై రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షో రూమ్ ను ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ…. నగరంలో జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం రెండవ బ్రాంచ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలంగాణ లో 20 బ్రాంచ్ లు వరల్డ్ వైడ్ సుమారు 190 బ్రాంచ్ లు ఉన్నాయని తెలిపారు.జోయాలుక్కాస్ అంటే బ్రాండ్ అని పెళ్ళిలకు, ఇతర ఫంక్షన్ లకు నమ్మకం తో వచ్చి జోయాలుక్కాస్ లో కొనుగోలు చేస్తారని అన్నారు.సరికొత్త డిజైన్ లతో కూడిన బంగారం, డైమండ్ ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. దశబ్దా కాలం నుంచి యాజమాన్యం నడిపిస్తున్నారని ఎలాంటి మోసాలు ఉండవని ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సిని నటి అంతర స్వర్ణాకర్ మాట్లాడుతూ… వరంగల్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.జోయాలుక్కాస్ షోరూం లో సరికొత్త డిజైన్ లతో కూడిన ఆభరణాలు ఉన్నాయని నగర ప్రజలు ఈ అవకాశంను ఉపయోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జోయాలుక్కాస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి,పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…





