గ్రేటర్ న్యూస్,హైదరాబాద్ మే 09 : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆదివారం తెలంగాణలో పర్య టించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా..
తెలంగాణ రాష్ట్రంలో రూ”9.400 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాలు పారిశ్రామిక ప్రాజెక్టు లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనిలో భాగంగా. రూ 2.360 కోట్లతో జహీ రాబాద్ ఇంటి గ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని మోడీ సభ ఏర్పాట్లకు సంబంధిం చి పార్టీ రాష్ట్ర నేతల మధ్య సమన్వయం సంపూర్ణంగా ఉంది ముఖ్య నేతలంతా మమేకమై ప్రచారం చేస్తున్నారు.అన్ని ప్రాంతాలకు వెళ్లి సభకు తరలిరావాలని పిలుపునిస్తున్నారు.
గోడలపై వాల్ రైటింగ్, బైక్ ర్యాలీలు ఇలా ఊరు వాడ పండగ వాతావరణం లో జనాన్ని ఆహ్వానిస్తు న్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా సభా ప్రాంగ ణం మొత్తం జర్మన్ టెంట్లు వేసి ప్రజలకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. నరేంద్ర మోడీ రాకతో మహా నగరం కాస్తా మొత్తం కాషాయమ యం కానుంది.
జన సమీకరణ కోసం బిజెపి శ్రేణులు ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు బస్సు లు ఏర్పాటు చేస్తున్నా రు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకే ఈ పర్య టన కీలకంగా మారనుంది.

