ఈ నెల 15 న పోలీసు వాహనాల పాత విడిభాగాల వేలం : వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

గ్రేటర్ న్యూస్, వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు వాహనాల పాత విడిభాగాలను ఈ నెల 15 తారీకు, శుక్రవారం రోజున వేలం వేయనున్నట్లు వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రభుత్వ పోలీస్ వాహనాలకు సంబంధించి రిపేర్ చేయబడిన బ్యాటరీలు, టైర్లు, విడిభాగాలను వేలంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.ఆసక్తి గల వ్యక్తులు శుక్రవారం ఉదయం 10 గంటలకు కమిషనరేట్ కార్యాలయంలోని మోటర్ ట్రాన్స్ఫోర్ట్ ఆపీస్ (యంటీవో)లో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 87126 85158, 9440242895,9949568320 నంబర్లకు సంప్రదించగలరని సీపీ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *