Breaking
27 Mar 2026, Fri

విద్యారంగానికి 30% బడ్జెట్ కేటాయించాలి –

ఎమ్మెల్యే నాయిని కి ఏఐఎస్ఎఫ్ వినతి పత్రం అందజేత

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి విద్యారంగా సమస్యలపై వినతిపత్రం అందజేశారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి భాష బోయిన సంతోష్ డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, హాస్టళ్లలో వసతుల సమస్యలు, స్కాలర్‌షిప్‌లు ఆలస్యం వంటి అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్బంగా సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులేని, కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను మూసివేయాలన్నారు.షూ ,టై, బెల్టు, పాఠ్యపుస్తకాల వంటి పేరుతో దందా చేసే విద్య సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జు జ్యోతి, జక్కుల భానుప్రసాద్, సిపతి వినయ్, జిల్లా సమితి సభ్యులు, సిహెచ్ వంశీ కుమార్, శ్రవణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *