Breaking
30 Aug 2026, Sun

బిజెపి జోనల్ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా గుగులోతు హుస్సేన్ నాయక్…

గ్రేటర్ న్యూస్, హనుమకొండ :  నగరంలోని 56వ డివిజన్ పరిధిలోని బంజారా కాలనీకి చెందిన గుగులోత్ హుస్సేన్ నాయక్ భారతీయ జనతా పార్టీ గోపాలపురం జోనల్ ఎస్టి మోర్చా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్ ఆదేశం మేరకు బిజెపి గోపాలపురం జోనల్ అధ్యక్షుడు బండి హరీష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి పప్పుల రమేష్ మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా కార్యాలయ కార్యదర్శి అలుగునూరి కృష్ణంరాజు, బిజెపి గోపాల్పూర్ జోనల్ కార్యదర్శి బొద్దిరెడ్డి సురేందర్ రెడ్డి, జోనల్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బత్తుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి సతీష్, జిల్లా నాయకులు ఆరే రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *