గ్రేటర్ న్యూస్, హనుమకొండ క్రైం : వాణిజ్య అవసరాలకు సబ్సిడీ సిలిండర్లు వాడుతున్నారని పక్క సమాచారంతో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ బద్రునాయక్ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ ఎస్సై లు సతీష్, కిషోర్, సిబ్బంది సంయుక్తంగా కలిసి నయీమ్ నగర్ లోని చైతన్య కర్రీ పాయింట్ లో తనిఖీ చేయగా అక్కడ అక్రమంగా 3 డొమెస్టిక్ 2-Hp,ఒక ఇండెన్ సిలిండర్ లను స్వాధీనపరచుకొని పంచనామ నిర్వహించి హనుమకొండ పోలీస్ స్టేషన్లో తగు చర్య గురించి ఫిర్యాదు చేయడం జరిగినది. ఈసందర్బంగా చైతన్య కర్రీ పాయింట్ నిర్వహిస్తున్న రేణిగుంట్ల చక్రవర్తి పై కేసు నమోదు చేసినట్టు హనుమకొండ సీఐ శివకుమార్ తెలిపారు.ఈ సందర్బంగా ఇన్‌స్పెక్టర్ మచ్చ శివ కుమార్ మాట్లాడుతూ గృహ వినియోగ సిలిండర్లు వ్యాపారాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.సబ్సిడీ సిలిండర్ల అక్రమ వినియోగంపై సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీఐ ప్రజలకు సూచించారు

