Breaking
30 Aug 2026, Sun

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని…

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : హనుమకొండ జిల్లా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ఉగాది పండుగ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలతో ఉండాలని , ప్రజలందరికీ ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు కలగాలని, గత సంవత్సరంలోని కష్టాలను అధిగమించి ఈ సంవత్సరం విజయాల బాటలో నడవాలని కోరారు. రైతులు పంటలతో సిరిసంపదలు సాధించాలని, యువత తమ లక్ష్యాలను చేరుకోవాలని, మహిళలు అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల సహకారంతో సంక్షేమ కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని ఎమ్మెల్యే నాయిని విశ్వాసం వ్యక్తం చేశారు.ఉగాది పచ్చడి లాగా జీవితంలో వచ్చే అనుభవాలన్నిటినీ సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచిస్తూ, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంటా ఆనందం, ఐక్యత నెలకొనాలని ఎమ్మెల్యే నాయిని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *