రతన్ సింగ్ ఠాకూర్,కోడిమాల శ్రీనివాసరావు…
నీటి పొదుపుపై అవగాహన ర్యాలీ…
గ్రేటర్ న్యూస్, హనుమకొండ : 34వ “ప్రపంచ నీటి దినోత్సవం” సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం వేయి స్తంభాల గుడి వద్ద నీటి పొదుపుపై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి యూత్ ఫర్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోడిమాల శ్రీనివాసరావు,ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ రతన్ సింగ్ ఠాగూర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మంచినీటి ప్రాముఖ్యత పై ప్రజలకు వివరిస్తూ…. ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరమును “నీరు, లింగ సమానత్వం,” నీరు ప్రవహించే చోట సమానత్వము పెరుగుతుందని , నీరు అందరికీ సమానంగా అందితే సమాజంలో సమానత్వము,ఐక్యత పెరుగుతాయని అన్నారు.నీరు జీవకోటికి ప్రాణాధారం నీరు లేనిదే జీవం లేదని మనకు లభిస్తున్న నీటిలో మూడు శాతం మాత్రమే అందులో 0.3 నీరు మాత్రమే త్రాగుటకు అనుకూలమైనదని తెలిపారు.మిగతా నీరు అంతా ధ్రువ ప్రాంతాల్లో ఘన రూపంలో ఉందని మిగతా 97% అంతా సాగుకు, త్రాగుటకు ఉపయోగకరము కానీ నీరని ఉన్న నీటిని పొదుపుగా వాడి భవిష్యత్ తరాల కోసం పొదుపు చేయాలని సూచించారు.ప్రతి వర్ష బొట్టును సంరక్షించాలని, అలాగే వృధాను అరికట్టాలన్నారు.జలమే సకల ప్రాణులకు జీవాధారం అని లేకుంటే మానవ మనుగడ ఊహించలేం కావున ప్రతి ఒక్కరం జల సంరక్షణ కోసం పునరంకితం కావాలని కోడిమాల శ్రీనివాసరావు,రతన్ సింగ్ ఠాగూర్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సొసైటీ బాధ్యులు దేవి శ్రీ ప్రసాద్, నీరజ్,రుత్విక్, విష్ణు, రోహిత్ ,అర్జున్ కార్తికేయ, రాజు తదితరులు పాల్గొన్నారు.

