Breaking
26 Mar 2026, Thu

భద్రకాళీ అమ్మవారికి లక్ష గన్నేరు పూలతో పుష్పార్చన….

గ్రేటర్ న్యూస్, వరంగల్ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్ర మహోత్సవములు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఐదవ రోజు కార్యక్రమాలలో  భాగంగా ఉదయం సోమవారం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరుపడిన పిమ్మట కల్పోక్త ప్రకారం వసంత నవరాత్ర ఉత్సవాల సందర్భంగా జరుపవలసిన విశేష జనహనామార్చనాభిషేకములు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి లక్ష కరవీర (గులాబిరంగు గన్నేరు) పూలతో అర్చన జరిపి అమ్మవారికి నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. ఈ రోజు కార్యక్రమాలకు ఉభయదాతలుగా కుందూరు అనిల్ రెడ్డి- అనిత దంపతులు వ్యవహరించారు.

దేవస్థానమును సందర్శించు భక్తుల దాహార్తి తీర్చుటకు వరంగల్ మార్వాడీ మిత్ర మండలి సభ్యులు  అర్జున్, ఉత్తమ్, ముఖేష్, రమేష్, దినేష్, హితేష్, భరత్, వినయ్ కేతారాం, క్రైలేష్, సురేష్లు 50 కూల్ వాటర్ క్యాన్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి  రామల సునీతకు ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న,ఓరుగంటి పూర్ణచందర్,  మయూరి రామేశ్వర్రావు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్ శ్రీధర్రావుల సమక్షమున అందజేశారు.

ఈ రోజు దేవాలయ హుండీ లెకింపు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ హుండీ పర్యవేక్షణ ఖమ్మం జిల్లా సహాయ కమీషనర్ ఎం. వీరస్వామి ఆధ్వర్యమున నిర్వహించబడింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ డా॥ బి. శివనుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్,  మయూరి రామేశ్వర్రావు, గాండ్ల స్రవంతి,బింగి సతీష్, జారతి వెంకటేశ్వర్లు, పాలడుగుల ఆంజనేయులు,  అనంతుల శ్రీనివాస్, శ్రీముగా శ్రీనివాసరావు, శ్రీధర్రావు, ఎక్స్ అఫీషియో మెంబర్ పార్నంది నర్సింహమూర్తి, లక్ష్మివెంకటేశ్వర, లక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *