హుండీ ఆదాయం రూ: 1,08,46,744/-
గ్రేటర్ న్యూస్, వరంగల్ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానం హుండీల లెక్కింపు కార్యక్రమంను సోమవారం ఖమ్మం జిల్లా సహాయ కమీషనర్ ఎం. వీరస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.హుండీ లెక్కింపు రూ.1,08,46,744 (ఒక కోటి ఎనిమిది లక్షల నలభై ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు ) ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ సునీత తెలిపారు.మొదటి సారిగా భద్రకాళి దేవస్థానంలో కోటి రూపాయల హుండీ ఆదాయం రావడం రికార్డు స్థాయిలో నిలిచింది.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ డా॥ బి. శివనుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్, మయూరి రామేశ్వర్రావు, గాండ్ల స్రవంతి,బింగి సతీష్, జారతి వెంకటేశ్వర్లు, పాలడుగుల ఆంజనేయులు, అనంతుల శ్రీనివాస్, శ్రీముగా శ్రీనివాసరావు, శ్రీధర్రావు, ఎక్స్ అఫీషియో మెంబర్ పార్నంది నర్సింహమూర్తి, లక్ష్మివెంకటేశ్వర, లక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

