గ్రేటర్ న్యూస్, హనుమకొండ : రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ అని బీసీలను మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్ ముదిరాజ్ విమర్శించారు. గ్రేటర్ వరంగల్ 10 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మచిలీబజార్ నందు సోమవారం రోజున సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పులి రజినీకాంత్ ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను, మైనార్టీలను మోసం చేసిందని విమర్శించారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీ లకు బడ్జెట్ లో ఏడాదికి 20 వేల కోట్లు కేటాయిస్తా అని హామీ ఇచ్చి. .. ఈ బడ్జెట్ లో కేవలం 11 వేల కోట్లు కేటాయించి బీసీ లను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిందని ఆరోపించారు.మూడు బడ్జెట్ లు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధులు కేవలం 33 వేల కోట్లు మాత్రమే నని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చిన హామీ ప్రకారం 60 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాల్సిందే… లేని పక్షంలో బీసీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ, బీసీ ప్రజా సంఘాలు పోరాడుతాయని హెచ్చరించారు.మైనార్టీల సంక్షేమానికి అధిక నిధుల కేటాయింపు చేయకపోవడం వారికి అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు.6 గ్యారంటీల అమలుకు అరకొర నిదులే కేటాయించి తెలంగాణ సమాజాన్నే కాంగ్రెస్ వంచించిందని తెలిపారు.దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధుల ఊసే లేదు అని విమర్శించారు.ఎన్నికల సమయంలో మాత్రం కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింది… ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు చిత్తశుద్ధి చూపడం లేదు దానికి సాక్ష్యమే ఈ బడ్జెట్ అని అన్నారు.బడ్జెట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం ఇక్కడి పాలకుల పని తనానికి నిదర్శనం అని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉడుతల సారంగపాణి, డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ ఖలీల్, మైనార్టీ అధ్యక్షుడు ఎండి కాజా,మహిళా నాయకురాలు వలస ప్రమీల, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సంపతి రఘు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వంగ రాము, డివిజన్ బీసీ నాయకులు భయ్యా శోభన్, పులి రవీందర్ పులి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

