గ్రేటర్ న్యూస్, హనుమకొండ : వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న సీతారామచంద్ర
స్వామి కల్యాణ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడిగా అలంకరించి పూజలు నిర్వహిం చారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీసీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు విశ్వక్సేనారాధన, నిత్యాహ్నికం నిర్వహించి రాముల వారి ఉత్సవ విగ్రహాన్ని మర్యాద పురుషోత్తముడిగా అలంకరించి చిత్రాన్న నైవేద్యం సమర్పించి నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. యాగశాలలో సుదర్శన హోమం నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు కృష్ణమూర్తి, శ్రీదేవి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు.ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు.

