Breaking
30 Aug 2026, Sun

ఎముకను కాపాడే ఆధునిక చికిత్స….ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ కె. బ్రిజేష్

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : ప్యాక్చర్ల చికిత్సలు ఉపయోగించే ఆధునిక శాస్త్ర విధానం చాలా సందర్భాలలో జాయింట్ రీప్లేస్మెంట్ చేయకుండా రోగి సహజ ఎముకను కాపాడే చికిత్సగా ఇది ఉపయోగపడుతుందని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ కె.బ్రిజేష్ అన్నారు. గురువారం హనుమకొండ యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత ఆకారానికి సరిపోయే ప్రత్యేక ప్లేట్లను అమరుస్తారని బలహీనమైన ఎముకలు ఉన్న వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.అవసరమైనప్పుడు బలమైన మెటల్ కేబుల్స్ వైర్లు ఉపయోగించి ఎముకను మరింత స్థిరంగా ఉంచుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్లు రాజకుమార్, స్వరాజ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *