Breaking
21 Aug 2026, Fri

యశోద హాస్పిటల్ లో అత్యాధునిక “ఇంటర్వెన్షన్ రేడియాలజీ” సేవలు


గ్రేటర్ న్యూస్,హనుమకొండ: ఆధునిక వైద్య రంగంలో
విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఇంటర్వెన్షన్ రేడియాలజీ విభాగంలో యశోద హాస్పిటల్స్ అత్యుత్తమ, మినిమల్లీ ఇన్వాసివ్ (అతి తక్కువ కోతతో కూడిన చికిత్సలను అందుబాటులోకి తెచ్చిందని డాక్టర్ మనీషా జోషి తెలిపారు. పెద్ద శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా,
ఎలాంటి పెద్ద కోతలు లేకుండా కేవలం ఒక చిన్న సూది రంధ్రం ద్వారా సంక్లిష్టమైన వ్యాధులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఎక్స్-రేలు, యాంజియోగ్రఫీ, సీటీ స్కాన్, యూఎస్ జీ, ఎంఆర్ వంటి రేడియాలజికల్ పద్ధతుల సహాయంతో చర్మాన్ని కోయకుండా నేరుగా
సమస్య ఉన్న ప్రాంతానికి వైద్యం చేస్తారు. మెదడులోని రక్తనాళాలు అడ్డుపడటం (స్ట్రోక్) లేదా రక్తనాళాలు ఉబ్బడం వంటి ప్రాణాంతక సమస్యలకు మెకానికల్ థ్రాంబెక్టమీ, కాయిలింగ్, స్టెంటింగ్ వంటి పద్ధతులతో సులభంగా పరిష్కారం చూపుతారు. కేవలం మెదడు
మాత్రమే కాకుండా ఊపిరితిత్తులు, పొత్తికడుపు, కాళ్లలో రక్తనాళాల అడ్డంకులు, కణితులు, గర్భాశయ ఫైబ్రాయిడ్లు, ప్రోస్టేట్, థైరాయిడ్ సమస్యలకు కూడా కుట్లు లేని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. యశోద ఆసుపత్రిలో క్లిష్టమైన వ్యాధులకు కచ్చితమైన నయం
అందించడానికి ‘బై-ప్లేన్ క్యాత్ ల్యాబ్’ వంటి అధునాతన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. సాంప్రదాయ శస్త్రచికిత్సల భారం లేకుండా, త్వరగా కోలుకునేలా అత్యాధునిక వైద్యం అందించడంలో
ఇంటర్వెన్షన్ రేడియాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. సంక్లిష్ట ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు యశోద హాస్పిటల్లోని ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్లను సంప్రదించి మెరుగైన ప్రయోజనం పొందవచ్చు.మేనేజర్ నరేష్, అసిస్టెంట్ మేనేజర్ స్వరాజ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *