Breaking
16 Jul 2026, Thu

గీసుగొండలో పోలీసుల కవాతు…

గ్రేటర్ న్యూస్, గీసుగొండ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలను పటిష్టం చేయడానికి ఆదివారం గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో  పోలీసులు భారీ కవాతు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు, చౌరస్తాలు,ఇతర ప్రాంతాల్లో కవాతు చేస్తూ పరిస్థితిని పర్యవేక్షించారు.ఈ సందర్బంగా సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ….ఎన్నికల సమయంలో ఎటువంటి ఆకస్మిక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం పెంపొందించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, చట్ట వ్యవస్థను కాపాడడం లక్ష్యంగా కవాతును చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని అభ్యర్థులకు,కార్యకర్తలకు,ప్రజలకు సీఐ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *