25 Feb 2026, Wed

చైనా మాంజా అమ్మిన, వాడిన కఠిన చర్యలు….గీసుకొండ సీఐ విశ్వేశ్వర్

గ్రేటర్ న్యూస్,గీసుకొండ : ప్రభుత్వం,కోర్టు ఆదేశాల ప్రకారం చైనీస్ మాంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్) ఖచ్చితంగా నిషేధించబడినందున, ప్రజలు, చిన్నారులు దీనిని ఉపయోగించవద్దని గీసుకొండ సీఐ డి. విశ్వేశ్వర్ సూచించారు. ఈ సందర్బంగా మంగళవారం సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ చైనీస్ మాంజా బయోడిగ్రేడబుల్ కాని నైలాన్,గాజు పూతతో కూడిన పదార్థంతో తయారు చేయబడిందని ఇది చాలా ప్రమాదకరమైనదని అన్నారు .ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పిల్లలు, పక్షులు, జంతువులకు తీవ్రమైన గాయాలు, మరణాలకు
కూడా కారణమైందని తెలిపారు. పిల్లలు సురక్షితమైన కాటన్ కైట్ దారాన్ని మాత్రమే ఉపయోగించేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎవరైనా చైనీస్ మాంజా చట్టవిరుద్ధంగా అమ్మకం లేదా వాడకం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *