గ్రేటర్ న్యూస్,హనుమకొండ: చక్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ మనుమడు అభ్యుదయ కృష్ణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు హనుమకొండలోని పలు ప్రాంతాలలో రగ్గులను పంపిణీ చేశారు. చలి తీవ్రతతో బాధపడుతున్న వారికి సహాయం చేయాలనే సంకల్పంతో పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చక్రి పౌండేషన్ సి.ఇ.ఓ. చెట్టిపల్లి దేవిక తెలిపారు. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోందని వీధిలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండులో ఉండే నిరుపేదలకు తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే తమ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలతో పాటు అనేక స్వచ్చంధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో చక్రి ఫౌండేషన్ సభ్యుడు రమేష్, లయన్ ధనలక్ష్మి పాల్గొన్నారు.

