25 Feb 2026, Wed

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం….

హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపును ప్రారంభించిన మంత్రి కొండ సురేఖ….

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు మొదలైంది.ఈ లెక్కింపును గురువారం దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు మొత్తం 500 మంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపడుతున్నారు.మొత్తం 788 హుండీలలోని కానుకలు లెక్కిస్తారు. గత జాతరలో 540 హుండీలు పెట్టగా 13.25 కోట్ల ఆదాయం వచ్చింది.ఈ ధపా అంతకన్నా ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.సుమారు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *