Breaking
16 Jul 2026, Thu

హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ ల ఆధ్వర్యంలో బస్ డ్రైవర్ల కు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు…

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : నిన్న పర్వతగిరి ప్రాంతంలో జరిగిన పాఠశాల బస్సు ప్రమాదం నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్  ఆదేశాల మేరకు హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ సీతారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం స్కూల్, కాలేజీ బస్ డ్రైవర్ల కు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. స్కూల్, కాలేజీ బస్సు డ్రైవర్లు మద్యం సేవించి వాహవాలు నడిపితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.ఈ తనిఖీలలో ట్రాఫిక్ ఎస్సై కొమురవెల్లి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *