గ్రేటర్ న్యూస్,హనుమకొండ: హనుమకొండ నగరానికి చెందిన డాక్టర్ శ్రీశైలం కు పి టి డబ్ల్యూ ఏ (ఫిజిక్స్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ) తరపున ఉత్తమ పరిశోధక అవార్డు -2025ను ప్రధానం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ అతిథి గృహంలో జరిగిన పి టి డబ్ల్యూ ఏ సమావేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ప్రొఫెసర్. శ్రీనాథ్, ప్రొఫెసర్ ప్రసాద్, ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, ప్రొఫెసర్. వరలక్ష్మి చేతుల మీదుగా అవార్డును అందజేశారు. దీనికిగాను ఎస్ఆర్ విద్యాసంస్థల అధిపతి,చాన్స్లర్. ఎ.వరదా రెడ్డి, ప్రో. ఛాన్స్లర్. ఎ. మధూకర్ రెడ్డి, వైస్ ఛాన్స్లర్. ప్రొఫెసర్. దీపక్ గార్గ్, ప్రొ.వి.సి. ప్రొఫెసర్. మహేష్, రిజిస్టార్. ప్రొఫెసర్. వెంకటరమణారావు, ఎస్ఆర్ యూనివర్సిటీ అధ్యాపక బృందం,పరిశోధక విద్యార్థులు డాక్టర్. శ్రీశైలం కు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్బంగా డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ…తనకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం గా ఉందని అలాగే అభినందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి, పి టి డబ్ల్యూ ఏ వ్యవస్థాక సభ్యులందరికీ డాక్టర్ శ్రీశైలం కృతజ్ఞతలు తెలియజేశారు.

