గ్రేటర్ న్యూస్,హనుమకొండ : ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ కార్పొరేట్ కార్యాలయం నుండి డైరెక్టర్ ఆపరేషన్ టి. మధుసూదన్ రేపటి నుండి ప్రారంభమయ్యే రంజాన్ పవిత్ర మాసాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లు (ఎస్ ఈ లు), డివిజనల్ ఇంజనీర్లు (డిఈ లు) ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్ టి. మధుసూదన్ మాట్లాడుతూ… ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఉన్న మసీదులు , ఈద్గాలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రంజాన్ మాసం మొత్తం ఎటువంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.అదేవిధంగా విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, క్షేత్ర స్థాయిలో అధికారులు మసీదులు , ఈద్గాలను సందర్శించి విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించాలని తెలిపారు. ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతతో నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో సి.ఈ లు కె . రాజు చౌహన్ , అశోక్ , జియంలు తదితరులు పాల్గొన్నారు.

