25 Feb 2026, Wed

పోలీస్ క్రీడల్లో జైత్ర యాత్ర కొనసాగిస్తున్న వరంగల్ పోలీసులు

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : నిన్నటి రోజు సైబరాబాద్ కమిషనరేట్ లో ప్రారంభమైన రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు రెండవ రోజు బుధవారం తమ జైత్ర యాత్రను కొనసాగించారు. ఈ క్రీడల్లో ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన క్రీడాకారులు మొత్తం 33 పతకాలను సాధించగా ఇందులో 6 స్వర్ణ పతకాలు, రజత పతకాలు 14, కాంస్య పతకాలు 13 వున్నాయి. ఇప్పటి వరకు సాధించిన పతకాల్లో ఆర్చరీ క్రీడల్లో మూడు విభాగాల్లో మొత్తం 9 పతకాలను సాధించగా ఇందులో ఎస్.ఐ గైక్వాడ్ అనిల్ కుమార్ మూడు స్వర్ణ పతకాలు, కానిస్టేబుల్ పి.చలపతి మూడు రజిత పతకాలను గెలుచుకోగా, మరో ఆర్చరీ క్రీడాకారుడు ఎల్. రాహుల్ మూడు కాంస్య పతాకాలను గెలుచుకున్నారు. కరాటే క్రీడలో సిసిఎస్ కానిస్టేబుల్ నరసింహ ఒక స్వర్ణం పతకంతో పాటు, రజితం, కాంస్య పతకాలను గెలుచుకున్నాడు, జూడో క్రీడలో ఏఆర్ RSI రవి, కానిస్టేబుళ్ళు రవి, కొండ నవీన్, చంద్రశేఖర్, హరీష్‌లు నాలుగు రజిత పతకాలను గెలుచుకోగా, స్మిమ్మింగ్ క్రీడలో మహిళా ఎస్.ఐ సాయి దివ్య కాంస్య పతాకాన్ని సాధించారు. అథ్లేటిక్స్ విభాగంలో 4 400 రిలే పరుగులో మహిళలు రజిత పతకం గెలుపుపోందగా, పురుషుల విభాగంలో కాంస్య పతాకాన్ని గెలుచుకున్నారు.
ఈ సందర్బంగా పతకాలను సాధించిన పోలీస్ క్రీడాకారులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపిఎస్  అభినందనలు తెలియజేసారు.

ఘనంగా ప్రారంభించబడిన స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ వేడుకలు

నాలుగవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ సోర్ట్స్ – 2026 క్రీడలకు సంబందించి సైబరాబాద్ కమిషనరేట్ పరేడ్ మైదానం నిర్వహించిన ప్రారంబోత్సవ వేడుకలకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిధిగా హజరయి ఈ క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడల ప్రారంబోత్సవ వేడుకల సందర్బంగా నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్‌లో ఆర్.ఎస్.ఐ శరత్ నేతృత్వంలో వరంగల్ కమీషనరేట్ పోలీస్ క్రీడాకారులు డీజీపీ వందన సమర్పణ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *