గ్రేటర్ న్యూస్, హనుమకొండ : బాలసముద్రంలోని షైన్ ప్రాథమిక పాఠశాలలో RANGMANCH (A feel of Joy) వార్షికోత్సవ సంబరాలు అంబరాన్ని తాకేలా శనివారం సాయంత్రం కాళోజి కళాక్షేత్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీజ గ్రూప్-1 ఆఫీసర్ పాల్గోని విద్యార్థుల ప్రతిభను, దాన్ని ప్రోత్సహించిన యాజమాన్యాన్ని ప్రశంసించారు. తాను షైన్ విద్యార్థిని కావడం గర్వంగా ఉందని పేర్నొన్నారు. కార్యక్రమం దీపప్రజ్వలనతో ప్రారంభమై, విద్యార్థులు నృత్యం, గానం, నాటికల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారు. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్సాహకరమైన గేమ్ షోలు, వారి పిల్లలతో ప్రదర్శించే అవకాశాన్ని కల్పించారు.ఈ వార్షికోత్సవం పాఠశాలకు మరో విజయవంతమైన ఘట్టంగా నిలిచి కృతజ్ఞత ప్రసంగంతో ముగిసింది.ఈ కార్యక్రమంలో అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ వీరయ్య , రాజేందర్ , శ్రీరాములు లింగయ్య , ఐఐటి ముంబై కిరణ్ ,షైన్ పాఠశాలల ఛైర్ పర్సన్ ముగల కుమార్ యాదవ్ , డైరెక్టర్ ఆరూరి కవిత , ప్రైమరి స్కూల్స్ కరెస్పాండెంట్ రమ , ప్రిన్సిపల్ సబిత , షైన్ ఇతర బ్రాంచీల ప్రిన్సిపల్స్ రాజ్ కుమార్, విశాల్, ప్రగతి రెడ్డి, కవిత రాణి, మానస, కాలేజీ ప్రిన్సిపల్స్, రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.






