గ్రేటర్ న్యూస్, హనుమకొండ : హనుమకొండ కేయూ కూడలి నుంచి హుజురాబాద్, కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులు బస్సు సెంటర్ లేక అనేక అవస్థలు పడుతున్నారని ప్రజల సౌకర్యం దృశ్య వెంటనే అనతాధికారులు బస్సు షెల్టర్ ను ఏర్పాటు చేయాలని కంటెస్టెడ్ కార్పొరేటర్ రావుల వెంకట రమేష్ గౌడ్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.హనుమకొండ నుండి హుజురాబాద్ మీదుగా కరీంనగర్, జమ్మికుంట పట్టణాల మీదుగా వివిధ ప్రాంతాలకు నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారని తెలిపారు. హెడ్ క్వార్టర్స్ నుంచి హుజురాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారి కేయూ కూడలికి ముందు బస్సుల కోసం ప్రయాణికులు బస్ షెల్టర్ లేక ఎండలోని వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నూతన బస్ షెల్టర్ ను ఏర్పాటు చేసి ప్రయాణికుల కష్టాలను తీర్చాల్సిందిగా వెంకటరమేష్ గౌడ్ ఉన్నతాధికారులను కోరారు.

