గ్రేటర్ న్యూస్, హనుమకొండ : నగరంలోని 31 డివిజన్ లోని కాలనీల అభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 31 డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు అన్నారు.సోమవారం న్యూ శాయంపేట చాకలి ఐలమ్మ విగ్రహం స్టార్ట్ వద్ద గల కాలనీవాసులు కార్పొరేటర్ ను కలిసి పలు సమస్యలను వివరించి తగిన పరిష్కారం చూపాలని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు . ఈ సందర్బంగా కార్పొరేటర్ మామిండ్ల రాజు మాట్లాడుతూ…డివిజన్ లోని కాలనీల అభివృద్ధి కి ప్రత్యేక ధ్యేయంగా కృషి చేస్తానని సి సీ రోడ్డు డ్రైనేజీలపై అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

