Breaking
16 Jul 2026, Thu

యువత చూపు హస్తం వైపు… ఎమ్మెల్యే నాయిని

ఎమ్మెల్యే నాయిని సమక్షంలో పార్టీలో చేరిన 100 మంది యువకులు…

గ్రేటర్ న్యూస్, హనుమకొండ :  నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పట్ల యువత భారీగా ఆసక్తి చూపుతున్నారని  వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.ఈ మేరకు నియోజకవర్గ పరిధిలో సుమారు 100 యువకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ నాయకులు పల్లె రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో బుధవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ చేరారు.వారికి ఎమ్మెల్యే నాయిని కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ…రానున్న రోజుల్లో యువతే రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారని క్షేత్ర స్థాయి నుంచే పార్టీ పునర్నిర్మాణం చేపట్టాలని యువతకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.అందరూ కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువకులు దీపక్,అజయ్ లతో కలిసి 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *