ముఖ్య అతిధిలుగా పాల్గొన్న ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి….
గ్రేటర్ న్యూస్,తొర్రూర్ : తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో తన పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా చైర్మన్ చాంబర్లో వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం చైర్మన్ తూనం శ్రవణ్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ లు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపి, చైర్మన్, పాలకవర్గం కలిసికట్టుగా పని చేసి అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలని సూచించారు. మున్సిపల్ అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. తొర్రూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుంచి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

