గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : వాహనదారులు తమ కుటుంబ క్షేమాన్ని దృష్టిలో వుంచుకోని మద్యం సేవించి వాహనం నడపోద్దని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ వాహనదారులకు సూచించారు. ‘ఆరైవ్ ఆలైవ్’ రెండవ విడత కార్యక్రమములో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పట్టు పట్టుపడిన వాహనదారులకు వరంగల్ కమిషనరేట్ కార్యాలయములోని ట్రాఫిక్ ట్రైనింగ్ కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ… ప్రతి వాహనదారుడు తప్పని సరిగా ట్రాఫిక్ నిబందనలు పాటించాల్సిన అవసరం ఎంతైన వుందని రోడ్లపై జరిగే రోడ్డు ప్రమాదాలకు మీరు బాధ్యులు కావద్దని, వాహనం నడిపే సమయంలో తమ స్వీరక్షణకై తప్పని సరిగా రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు.ఇటీవల కాలం రాష్ట్రంలో హత్యల కన్న రోడ్డు ప్రమాదాలో మరణించిన వారి సంఖ్య అధికమని, ఈ ప్రమాదాలు అధికంగా మద్యం మత్తులో జరిగినవి పోలీసులు గుర్తించారని తెలిపారు.మద్యం సేవించి వాహనం నడపటం కారణంగా మీతో పాటు రోడ్డుపై నడిచి వెళ్ళేవారు, ఇతర వాహనదారులు సైతం ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారన్నారు.రోడ్డు ప్రమాదాల్లో ఇంటి యజమాని మరణించడంతో ఆ కుటుంబం రోడ్డు పడుతున్నాయని ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు దీనస్థితిలో తమ జీవితాలను కోనసాగిస్తూన్నాయని ట్రాఫిక్ ఏసీపీ తెలియజేసారు. ఈ కార్యక్రమములో హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ సీతారెడ్డి, ట్రైనింగ్ సెంటర్ ఎస్.ఐ నారాయణ పాల్గోన్నారు.

