ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం..
గ్రేటర్ న్యూస్,వరంగల్ : ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు.తూర్పు నియోజకవర్గం లోని జి డబ్ల్యూ ఎంసి పరిధిలోని 12,33వ డివిజన్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి ఆదివారం నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో కలిసి మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. దేశాయిపేట్ తుమ్మలకుంట లబ్ధిదారులైన అడేపు కల్పనా ప్రవీణ్ కుమార్, పెరకవాడలోని నరహరిశెట్టి రమాదేవి కుటుంబ సభ్యులకు మంత్రి కొండా సురేఖ నూతన వస్త్రాలు అందజేసి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ద్వేయం” అని పేర్కొన్నారు.గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తాం అని చెప్పి పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నిజమైన న్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




