గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : పదవీ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ సూచించారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగంలో సుధీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారుల శనివారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పదవీ విరమణ పొందిన వారిలో సబ్ ఇన్స్ స్పెక్టర్లు సిద్దయ్య, సాంబారెడ్డి కనకచంద్రం, సయ్యద్ చాంద్ పాషా,లింగారెడ్డి,రాజు ఆర్.ఎస్.ఐ మహమూద్, ఏ. ఆర్. ఏ. ఎస్. వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుళ్ళు రమేష్, రాములు వున్నారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… సుధీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖ కు సేవాలందించిన పదవీవిరమణ చేస్తున్న అధికారులు నేటి తరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు . పదవీ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలని కోరారు . పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం నుండి అందే డబ్బు ను భవిష్యత్తు అవసరాలకు భద్రపర్చుకోవాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్,ఆర్. ఐలు స్పర్జన్ రాజ్, సతీష్, ఆర్. ఎస్. ఐ శ్రవణ్ కుమార్ తో పాటు, ఇతర పోలీస్ సిబ్బంది, పదవీ విరమణ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

