Breaking
26 Mar 2026, Thu

సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం… వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ సహజ సిద్దమైన రంగులను వినియోగిస్తూ హోలీ పండుగను ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.ముఖ్యంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హోలీ అనంతరం యువత స్నానాల కోసం శివారు ప్రాంతాల్లోని చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని, ఒక వేళ వెళ్ళాసి వస్తే తగు జాగ్రత్తలను పాటించాలని తెలిపారు.ప్రధానముగా బహిరంగ ప్రదేశాలపై, అనుమతి లేకుండా వ్యక్తులపై, మహిళలు, యువతులు,వాహనాలపై రంగులు చల్లడం బైకులపై, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు . హోలీ పండుగను సజావుగా జరుపుకొనేందుకు వరంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించబడుతుందని, ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని సీపీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *