Breaking
30 Aug 2026, Sun

తప్పైతే రాజీనామా చేస్తా… సవాల్ విసిరిన ఎమ్మెల్యే నాయిని..

200 కోట్ల దోపిడీపై CBI, CID దర్యాప్తు చేయాలని డిమాండ్…

అసెంబ్లీలో గర్జించిన ఎమ్మెల్యే నాయిని…

గ్రేటర్ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పాలనలో వేల కోట్ల అవినీతి చేసిన వారు ఇప్పుడు దొంగలే దొంగ అని ఆరోపించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.BRS నాయకులు సుమారు 200 కోట్ల అక్రమ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించిన ఆయన, ఈ వ్యవహారంపై వెంటనే CBI, CID దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ అవసరమని స్పష్టం చేశారు.తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపితమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటించారు. అదే విధంగా కేటీఆర్, హరీష్ రావు కూడా రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నిస్తూ సవాల్ విసిరారు.హనుమకొండలో పార్క్ భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారనే ఆరోపణలను ప్రస్తావిస్తూ, దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.తన రాజీనామా లేఖను నేరుగా స్పీకర్ కి పంపిస్తున్నానని తెలిపారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే తమపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *