సీపీని కలిసిన ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, డీసీసీ అధ్యక్షులు ఇనగాల, అయూబ్
గ్రేటర్ న్యూస్, హనుమకొండ : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు హంటర్ రోడ్డులో నిర్వహించిన సభలో పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యులు కేఆర్ నాగరాజు , హనుమకొండ–వరంగల్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి , అయూబ్ తీవ్రంగా ఖండిస్తూ బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ని కలిసి కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రజాప్రతినిధిగా బాధ్యతారాహిత్యంగా, అసభ్యకరంగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ, చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సంబంధించిన అన్ని సెక్షన్ల కింద వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో విద్వేషం రేకెత్తించేలా, వ్యక్తిగత పరువు నష్టం కలిగించేలా చేసిన ఈ వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని కోరారు.

