టీయూడబ్ల్యూజే (ఐజేయూ) డైరీని ఆవిష్కరించిన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద…

గ్రేటర్ న్యూస్, వరంగల్ :టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వరంగల్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో గురువారం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చేతుల మీదుగా ప్రారంబించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వానికి సమాజానికి మధ్యలో వారదిగా ఉన్న జర్నలిజం పాత్ర గొప్పదని ఇందులో మెరుగైన జర్నలిజం కోసం యూనియన్ల భాద్యత మరి గొప్పదని వ్యా ఖ్యానించారు.ఈరోజు తన చేతుల మీదుగా డైరీఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు.ఇంతటి సుదీర్గ చరిత్ర కల్గిన ఇండియన్ జర్నలిస్టు యూనియన్ సేవలు సమాజానికి మరింతగా దోహాదపడాలన్నారు. మెరుగైన సమాజం కోసం ప్రతిఒక్కరు భాద్యతగా ఉండలని అందులో తానుకూడా ముందు వరుసలో ఉంటానని జిల్లా కలెక్టర్ సత్యశారద తెలిపారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ రాం రాంచందర్,ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గా ప్రసాద్, ఉపాధ్యక్షులు మహాదేవుని జగదీష్,సహాయ కార్యదర్శులు బొమ్మగాని సతీష్ కుమార్,చింత నూరి రాజు,బాదవత్ బాలాజీ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అద్యక్షులు కందుల శ్రీధర్, జిల్లా నాయకులు పిన్న శివకుమార్,మహేష్ కుమార్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *