గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : మెడికల్ విద్యకు సంబంధించి రేపు జరిగే నీట్ ప్రవేశ సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణ లో భాగంగా సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు తెలిపారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 11 పరీక్ష కేంద్రాల్లో( హన్మకొండ 04,వరంగల్ 02, కాజీపేట 3,జనగామ 2 వున్నాయి ) రేపు మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించబడుతుందని పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.
1. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.
2. సభలు, సమావేశాలు, ర్యాలీ లు, ధర్నాలు నిషేధం.
3. పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు తేది 03-05-26 ఉదయం 06:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు మూసివేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

