Breaking
30 Aug 2026, Sun

భద్రకాళి ట్యాంక్ బండ్ ను ప్రారంభించిన మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ

గ్రేటర్ న్యూస్, వరంగల్ :   గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (జీ డబ్ల్యూ ఎస్ సి సి ఎల్)ఆధ్వర్యం లో బల్దియా పరిధి 29 వ డివిజన్ భద్రకాళి బండ్ (పోతన రోడ్డు వైపు) పై స్మార్ట్ సిటీ నిధులు రూ.84.20 కోట్ల అంచనా వ్యయం తో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ ముఖ్య అతిధిలుగా హాజరై ప్రారంభించారు.అనంతరం 3 వ డివిజన్ లోని పైడిపల్లి లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని  మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య,నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక వరంగల్ (పశ్చిమ)శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , వర్ధన్నపేట శాసన సభ్యులు కే ఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్/ బల్దియా ఇంచార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, 03 వడివిజన్ కార్పొరేటర్ జున్ను షిభారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *