గ్రేటర్ న్యూస్, భూపాలపల్లి : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన హోం గార్డు రంజిత్ మృతదేహానికి బుధవారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.అదేవిధంగా, మృతుడి కుటుంబానికి పోలీస్ శాఖ తరఫున ఆర్థిక సహాయం అందజేశారు.

