సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలి…. వరంగల్ సీపీ..

వరంగల్ పోలీస్ రేంజ్ నూతన కార్యాలయ భవనంను ప్రారంభించిన వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ …

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : సమస్యలపై పోలీస్ అధికారులు , సిబ్బంది తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ IPS అన్నారు.నూతనంగా ఏర్పాటు చేసిన వరంగల్ పోలీస్ రేంజ్ పరిపాలన కార్యాలయ భవనాన్ని శనివారం సీపీ  ప్రారంభించారు. హనుమకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్ లో ఏర్పాటు చేసిన నూతన వరంగల్ పోలీస్ రెంజ్ కార్యాలయంలో వరంగల్ రేంజ్ పోలీస్ అధికారులకు సంబందించిన శాఖ పరమైన పరిపాలన కార్యకలాపాలు ఈ భవనం నుండి కొనసాగనున్నాయి.ఈ నూతన కార్యాలయంను ప్రారంభించిన సీపీ కార్యాలయంలో సదుపాయాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… పోలీస్ అధికారుల శాఖపరమైన సమస్యలపై రేంజ్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని, పరిపాలన పనితీరులో పారదర్శకంగా, బాధ్యతాయుతమైన పని తీరు ఉండాలని వరంగల్ సీపీ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డీసీపీలు దార కవిత, అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, రేంజ్ కార్యాలయం సూపరింటెండెంట్ యుగేందర్, ఏసీపీలు సత్యనారాయణ, నర్సింహా రావు, సురేంద్రతో పాటు ఆర్. ఐలు, ఇన్స్పెక్టర్లు ఇతర రేంజ్ కార్యాలయ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *