Breaking
17 Jul 2026, Fri

ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఏప్రిల్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక సూచించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె పలు వివరాలు వెల్లడించారు.
జర్నలిస్టులు తమ యాజమాన్యాల నుంచి పొందిన సిఫార్సు లేఖతో పాటు అవసరమైన పేపర్ కటింగులు విద్యార్హతల సర్టిఫికెట్లు ఇండిపెండెంట్ జర్నలిస్టులు కటింగ్లతో పాటు సంబంధిత ఎడిటర్ పత్రికకు వార్తలు రాసినట్లు ధ్రువీకరించే లేఖ సంబంధిత అర్హత పత్రాలను జత చేయడంతో పాటు తాము వేరే ఇతర వృత్తులలో అనగా సొసైటీ చైర్మన్, డైరెక్టర్ ప్రభుత్వ ఉద్యోగం, న్యాయవాద వృత్తి, సర్పంచ్ తదితర ఇతరత్రా ఏ పద
పదవుల్లో కొనసాగడం లేదని సెల్ఫ్ డిక్లరేషన్ జతచేసి హార్డ్ కాపీని సంబంధిత డిపిఆర్ఓ కార్యాలయాలలో అందజేయాలని, అప్లికేషన్‌ను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై సంబంధిత అధికారులకు కఠిన చర్యలకై ఆదేశాలు ఇవ్వనున్నట్లు స్పెషల్ కమిషనర్ వెల్లడించారు.ఇప్పటికే రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ రెండు సార్లు సమావేశమై జీఓ అమలు, విధి విధానాలపై చర్చించిందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తూ, అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన జర్నలిస్టులకు కార్డులు జారీ చేసే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *