ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని బుధవారం ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ IPS సందర్శించి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది సీపీ పనితీరును తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామీణ ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలని, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే “Arrive Alive” కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగహన కల్పిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.స్టేషన్ రికార్డులను పరిశీలించిన అనంతరం సీపీ మాట్లాడుతూ… గ్రామాల హిస్టరీ షీట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికారులు, సిబ్బంది గ్రామాల పర్యటనలను తరచుగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్.ఐ రాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *