Breaking
1 Jun 2026, Mon

“Say No to Drugs” అంశంపై అవగాహన ర్యాలీ…

ప్రారంభించిన సీపీ సన్ ప్రీత్ సింగ్ , కలెక్టర్ ఛాహాత్ బాజ్‌పాయ్

గ్రేటర్ న్యూస్,హనుమకొండ : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా “Say No to Drugs” అంశంపై శనివారం ఉదయం అవగాహన ర్యాలీ నిర్వహించబడింది.ఈ ర్యాలీని వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్,  జిల్లా కలెక్టర్ ఛాహాత్ బాజ్‌పాయ్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ ర్యాలీ హనుమకొండ అదాలత్ సర్కిల్ నుండి హనుమకొండ కలెక్టరేట్ వరకు సాగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించాలని సూచించారు. ఈ సందర్భంగా మానవహారం నిర్వహించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ ధార కవిత, అడిషనల్ డీసీపీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్,ఏసీపీ లు, ఇన్స్పెక్టర్ లు,డిడబ్ల్యుఓ విశ్వజ పోలీస్, ఎక్సైజ్ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఈగల్ టీం, ఆశా వర్కర్లు, శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *