Breaking
1 Jun 2026, Mon

పోనగంటి లక్ష్మీనారాయణకు దళితరత్న అవార్డు…

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : సాంఘీక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా అదివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో వరంగల్ ఉమ్మడి జిల్లా మాల సంఘాల JAC కన్వీనర్ పోనగంటి లక్ష్మీనారాయణకు దళిత రత్న అవార్డును అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 14న భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పూలే, అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేసిన వారికీ ఈ అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గత 25 సంవత్సరాలుగా పూలే, అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తున్న పోనగంటి లక్ష్మీనారాయణ సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. సమయాభావం వలన ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో ఇవ్వలేకపోయామని తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..తనకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాకు ఈవార్డు రావడం కోసం కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ మాజీ చైర్మన్ చెరుకు రాంచందర్, బండి అశోక్ కి కృతజ్ఞతలు తెలిపారు.
————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *