Breaking
16 Jul 2026, Thu

రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు.. 27 మంది అధికారులకు స్థానచలనం…

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లలతో సహా మొత్తం 27 మందిని బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. బి.హరిసింగ్ సూర్యాపేట అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా, డి. రాజ్యలక్ష్మి పెద్దపల్లి అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమితులయ్యారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ ఆర్. డీ. మాధురి నల్గొండ ఐ&సీఏడీ (I&CAD) స్పెషల్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. టీఎల్. సంగీత సంగారెడ్డి అదనపు కలెక్టర్గా, మధు మోహన్ గద్వాల అదనపు కలెక్టర్గా పదోన్నతి పొంది బదిలీ అయ్యారు. అదేవిధంగా నిజామాబాద్ డీఆర్వోగా బి.గీత, భద్రాద్రి కొత్తగూడెం డీఆర్వోగా ఎస్. పద్మావతి, ఆదిలాబాద్ డీఆర్వోగా బి. స్రవంతి నియమితులయ్యారు. ఎన్.రాజేందర్ రెడ్డి సిరిసిల్ల
ఆర్డీవోగా, ఎం. శర్మిల ఉట్నూర్ ఆర్డీవోగా, ఎం. విజయ కుమారి బోధన్ ఆర్డీవోగా పోస్టింగ్ పొందారు. ఎస్. రమణా రెడ్డి మిర్యాలగూడ ఆర్డీవోగా బదిలీ అయ్యారు. సదరు అధికారులంతా తక్షణమే విధుల్లో చేరాలని, వారు బాధ్యతల నుంచి రిలీవల్ అయిన తేదీ, కొత్త చోట చేరిన వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. బదిలీ అయిన వారిలో వెయిటింగ్లో ఉన్న వారు, వివిధ శాఖల్లో డెప్యుటేషన్పై ఉన్న వారు కూడా ఉన్నారు. బదిలీ అయిన ఆర్.వీ. రాధాబాయి (డిప్యూటీ కలెక్టర్) తదుపరి పోస్టింగ్ కోసం రెవెన్యూ విభాగంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *