Breaking
1 Jun 2026, Mon

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించవద్దు… వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలకో చట్టాలను అతిక్రమించ వద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. మూగ జీవాల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గో రక్షణ కమిటీలతో  సీపీ మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా మూగ జీవాల అక్రమ రవాణాకు నియంత్రణకై తీసుకోవాల్సిన చర్యలపై గో రక్షణ సమితి సభ్యులను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… వరంగల్ కమిషనరేట్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతం వాహన తనీఖీలు నిర్వహించబడుతాయని, ఇందుకోసమని ప్రత్యేకంగా పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని అదే విధంగా గోవుల అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా సమాచారం తెలిసిన వెంటేనే పోలీసులకు సమాచారం అందించాలి కాని గోవులను రక్షించాలనే క్రమంలో గో రక్షణ కమిటీ సభ్యులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని తెలిపారు.ముఖ్యంగా ఇదే సమయంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు రక్షణ కమిటీ సభ్యులు వాహనాలపై రవాణా చేస్తున్న వాహనాన్ని వెంబడిస్తూ వేగంగా వాహనాలను నడపటం చాలా ప్రమాదకరమని అన్నారు.అలాగే అక్రమంగా మూగ జీవాలను తరలిస్తున్న వాహనాలను అడ్డుకునే సమయంలో నిందితులు దాడులకు పాల్పడే అవకాశాలతో పాటు శాంతి భద్రతలు సమస్యలు రావచ్చని అన్నారు.మీరు కూడా ప్రమాదంలో పడే అవకాశాలు వున్నాయని, ఇకపై స్థానికంగా వున్న గో రక్షణ కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లను స్థానిక పోలీసులతో షేర్ చేసుకోవడం ద్వారా నకలీ ఫోన్ కాల్స్‌ను కట్టడి చేయవచ్చని సూచించారు.దీని ద్వారా త్వరితగతిన గోవులను రక్షించే అవకాశం కలుగుతుందని మూగ జీవాలను అక్రమంగా తరలించే వారిని పట్టుకోవడం పోలీసుల బాధ్యతని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తెసుకోబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్‌కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, ట్రైనీ ఐపిఎస్ మనిషా నేహ్రా,ఏసిపిలు జితేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, భీంశర్మ, సతీస్‌బాబు, రవీందర్ రెడ్డితో పాటు ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు, గో రక్షణ, బంజరంగ్, విశ్వహిందు పరిషత్‌కు చెందిన ప్రతినిధులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *