గ్రేటర్ న్యూస్, వరంగల్ : జీర్ణవ్యవస్థ, కాలేయం, ప్యాంక్రియాస్ మరియు పిత్తనాళాలకు సంబంధించిన సంక్లిష్ట వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ విభాగం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక సేవలను అందిస్తోందని ప్రముఖ యశోద హాస్పిటల్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. గురువారం హనుమకొండ యశోద ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వైద్య నిపుణులు నరేష్, రాజ కుమార్, స్వరాజ్ఞతో కలిసి ఆయన మాట్లాడారు. పూర్తిస్థాయి సర్జరీల అవసరం లేకుండా, కేవలం ఎండోస్కోపీ ద్వారానే రోగులకు అత్యంత సురక్షితమైన పద్ధతుల్లో చికిత్స అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు ద్వారా ఎండోస్కోపిక్ సబ్ మ్యూకోసల్ డిసెక్షన్ తో ప్రారంభ దశలో ఉన్న క్యాన్సర్ గడ్డలను సర్జరీ లేకుండానే తొలగించవచ్చు. పెరొరల్ ఎండోస్కోపిక్ మయోటమీతో ” మింగడానికి ఇబ్బంది పడే రోగులకు ఎండోస్కోపీ ద్వారా ఉపశమనం. యాంటీ- రిఫ్లక్స్ మ్యూకోసెక్టమీతో తీవ్రమైన గ్యాస్, ఎసిడిటీ రిఫ్లక్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం. క్యాప్సూల్ ఎండోస్కోపీ, బెలూన్ ఎంటెరోస్కోపీతో సాధారణ స్కానింగ్కు దొరకని చిన్న పేగుల్లోని రక్తస్రావం, పాలిప్స్న గుర్తించవచ్చు. లివర్ ట్రాన్స్ ప్లాంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న లివర్ రోగులకు రక్తాన్ని శుద్ధి చేసి పునర్జన్మ ఇవ్వడం. ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ ప్లాంటేషన్ తో మందులకు లొంగని క్లోస్ట్రీడియోయిడ్స్ ఇన్ఫెక్షన్లకు అత్యాధునిక చికిత్స యశోద హస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, జీర్ణాశయ రక్తస్రావం వంటి సమస్యలతో బాధపడేవారు నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే నిపుణులను సంప్రదించాలి. అత్యాధునిక సాంకేతికత, బహుళ విభాగాల సమన్వయంతో యశోద హాస్పిటల్స్ రోగులకు ప్రపంచస్థాయి వైద్యసేవలను అందుబాటు ధరల్లోనే అందిస్తోందని డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నరేష్, రాజ్ కుమార్, స్వరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.

