అరెస్ట్ చేసిన దళితులను బేషరతుగా విడుదల చేయాలి
…………………………………..
గ్రేటర్ న్యూస్, హనుమకొండ : గోపాలపురం చెరువు సుందరీకరణ పేరుతో సమాధులను తొలగించవద్దని అడ్డుకున్న గోపాలపురం గ్రామ దళితులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని గోపాలపురం కంటెస్టెడ్ కార్పొరేటర్ రావుల వెంకట రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…రెక్కాడితే గానీ డొక్కాడని దళితుల పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు సమంజసంగా లేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితుల పట్ల చిత్తశుద్ధి లేదని అందుకే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అరెస్ట్ చేసిన దళితులను బేషరతుగా విడుదల చేయాలని వెంకట రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమాధుల కూల్చివేతను అడ్డుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం…రావుల వెంకట రమేష్ గౌడ్

