గ్రేటర్ న్యూస్,మేడారం :మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర జనవరి 28 నుంచి 31 తేది వరకు జాతర భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగిందని ములుగు జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించిన మంత్రి సీతక్క చొరవతో జాతర విజయవంతమైందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మేడారం అభివృద్ధి చెందిందని భక్తులు ప్రశంసించారని సీఎం రేవంత్ రెడ్డి కి,సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

