గ్రేటర్ న్యూస్,సుబేదారి : గ్రేటర్ వరంగల్ పరిధిలోని 50వ డివిజన్ జులైవాడ జంక్షన్ వద్ద బిఆర్ఎస్ నాయకులు అంకెం లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అసమానతమానతలపై అక్షర యుద్ధం చేసిన మహనీయుడి జయంతి దేశ వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతుందని, పార్టీలకతీతంగా, నాయకులందరూ కొలిచే నాయకుడిగా అంబేద్కర్ విరాజిల్లుతున్నది గుర్తు చేశారు.అలాగే కార్యక్రమం నిర్వాహకులు బీఆర్ఎస్ యువ నాయకులు అంకం లక్ష్మణ్, కృష్ణమూర్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్మికులకు చీరల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నెక్కొండ కిషన్, డివిజన్ ప్రముఖులు, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కోటేశ్వర్ సీనియర్ నాయకులు వీపీ రెడ్డి, కృష్ణమూర్తి, మహేందర్ రెడ్డి, గుండెకానీ మహేందర్, మాతంగి రమేష్, గునికంటి చందర్, బిక్షపతి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

